Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రస్తుతం అనుష్కా శెట్టి (Anushka shetty)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఓ ఫన్ వీడియోతో సినిమా అప్డేట్ అందించాడు నవీన్ పొలిశెట్టి.
జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యువ హీరో
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). జాతిరత్నాలు సినిమాతో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో ప్రస్తుతం అనుష్కా శెట్టి (Anushka shetty)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో 20 ఏండ్ల యువకుడి పాత్రలో నవీన్ పొలిశెట్టి కనిపించనుండగా.. 40 ఏండ్ల మహిళగా అనుష్క మెరవనుంది. చాలా రోజుల తర్వాత ఓ ఫన్ వీడియోతో సినిమా అప్డేట్ అందించాడు నవీన్ పొలిశెట్టి.
హాయ్ అనుష్క.. చాలా బాగున్నావ్.. మన సినిమా చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది కదా.. టైటిల్ పెట్టే టైం వచ్చిందటా.. అంటూ స్వీటీ కటౌట్స్ ముందు నిలబడి ఫన్ చిట్ చాట్ చేశాడు. మన సినిమాకు ‘దేవసేన నీ మనసులో ఉన్నది నేనేనా’, ‘స్వీటీతో ఎవడీ క్యూటీ’ టైటిల్ ఎలా ఉందని అడుగుతున్నాడు. ఫైనల్‌గా రేపు టైటిల్ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని తెలియజేశాడు నవీన్ పొలిశెట్టి. ఈ ఫన్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పీ డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి మరోవైపు అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా నటిస్తున్నాడు. లాక్డౌన్ టైంలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క ఇప్పటివరకు నవీన్ పొలిశెట్టి ప్రాజెక్ట్ మినహా కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు.
నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్ సాగిందిలా..
Get ready for a crazy ride tomorrow 🤩
Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar @UV_Creations #ProductionNo14 #Anushka48 #NaveenPolishetty3 #KotagiriVenkateswararao pic.twitter.com/6Atsc9LHzQ
— UV Creations (@UV_Creations) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

