Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ‘బలగం’ (Balagam). వేణు ఎల్దండి (కమెడియన్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సిరిసిల్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ‘బలగం’ (Balagam). సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వేణు ఎల్దండి (కమెడియన్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సిరిసిల్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్మాత దిల్‌రాజుతోపాటు చిత్రయూనిట్ సభ్యులు ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈవెంట్లో హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..సిరిసిల్లకు వస్తే మా అమ్మమ్మ వాళ్ల ఊరికొచ్చినట్టనిపిస్తది. మేమంతా ఇక్కడ షూటింగ్ చేసినన్ని రోజులు మీరిచ్చిన ప్రేమే కారణం. నేను తెలంగాణలో కొత్తగూడెం ప్రాంతంలో పుట్టాను. కానీ ఫ్యామిలీ అంతా హైదరాబాద్‌లో సెటిల్ అవడం వల్ల ఎప్పుడూ తెలంగాణ ఊళ్లల్లోకి వెళ్లే అవకాశం దక్కలేదు. సిరిసిల్ల నుంచి లోపలికి ఊళ్లల్లకు వెళ్లి 50 రోజులపాటు షూటింగ్ అంటే ఎట్లుంటదో అనే భయం ఉండేది. కానీ ఇక్కడికి రాగానే గ్రామాల్లో ఉన్న రోడ్లు, సౌకర్యాలు చాలా అద్భుతంగా అనిపించాయి. అలాంటి సౌకర్యాలు అందించిన మంత్రి కేటీఆర్ సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంది.
నేను ఇతర రాష్ట్రాలకెళ్లినపుడు మా తెలంగాణ ఊర్లలో రోడ్లు ఎంత బాగుంటయి తెలుసా..? అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. తెలంగాణలో నేనెక్కడైతే పుట్టానో ఆ ప్రాంతానికి నన్ను పరిచయం చేస్తారనుకుంటే..? వేణు తీసిన సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతిని నాకెంత నేర్పించారో.. అందరూ కూడా సినిమాలో అదే చూస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇలాంటి సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు వేణు సార్‌కు చాలా ధన్యవాదాలు. మార్చి 3న మీరంతా సినిమా చూస్తారని నేననుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
బలగం ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

