ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తోంది. బాలీవుడ్ (Bollywood) కు వెళ్లాలన్న తన కల కూడా నెరవేర్చుకుంది. ఈ భామ నటిస్తోన్న తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)తో కలిసి చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ముంబై లో శనివారం మిషన్ మజ్ను చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మిషన్ మజ్ను షూటింగ్ అనుభవాలను తన అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంది రష్మిక మందన్నా. సెట్స్ లో చాలా లవ్ లీ సమయాన్ని గడిపానని, తన మొదటి హిందీ సినిమా షూటింగ్ పూర్తయిందని నమ్మలేకపోతున్నానని ఎమోషనల్ గా చెప్పింది రష్మిక. నేను తొలిసారి ఈ సినిమా కథ విన్నపుడు..నేను ఇలాంటి అందమైన చిత్రంలో భాగం కావాలనుకున్నానని సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుందీ కన్నడ సోయగం.
రష్మిక ఈ చిత్రంతోపాటు హిందీలో అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. మొత్తానికి ఇలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక.
& It’s a wrap..❤️ what a lovely lovely time I had shooting for #missionmajnu 🌸
— Rashmika Mandanna (@iamRashmika) August 28, 2021
I..for one..can’t believe.. I have already wrapped for my first Hindi film.. I remember the time I heard the script for the first time and I went like.. ‘I want to be a part of this beautiful film’❤️ https://t.co/02C0P8duQt
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర