Rashmika Mandanna | చాలా కాలంగా సరైన హిట్స్ లేని బాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులొచ్చాయి. అజయ్ దేవ్గన్ నటించిన సైతాన్ సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. జూన్‌లో విడుదలైన Munjya సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇటీవలే విడుదలైన స్త్రీ 2 ఏకంగా రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఈ రికార్డులను బద్దలు కొట్టేందుకు నేను కూడా రెడీ అంటోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ఇప్పటిదాకా గ్లామరస్ రోల్స్‌లో మెరిసిన రష్మిక మందన్నా ఇక అందరినీ భయపెట్టిస్తానంటోంది.
రష్మిక హిందీ సినిమాకు సైన్ చేసింది. ఈ మూవీకి Vampired of Vijayanagara టైటిల్‌ను ఫిక్స్ చేశారు. Munjya ఫేం ఆదిత్య సర్పొట్దర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రెండు టైమ్ లైన్స్ ఆధారంగా సినిమా ఉండబోతుందట. వీటిలో ఒకటి విజయ నగర సామ్రాజ్యంలోని హంపి సిటీ కాగా.. రెండోది నార్తిండియాలోని ఓ చిన్న కుగ్రామం. ఇందులో రష్మిక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ఈ భామ పుష్ప ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, సికిందర్, కుబేర సినిమాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. పుష్ప ది రూల్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?