ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ (Forbes India) ఇండియా వెల్లడించిన ప్రకారం దక్షిణాదిన అత్యంత ప్రభావవంతమైన తారల్లో కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) టాప్ ప్లేస్‌లో నిలిచిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా అకౌంట్లలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య, వారు పెట్టే పోస్టులకు వచ్చే లైక్స్, వీడియోలు చూసే సమయం ఆధారంగా సినీ తారలకు రేటింగ్ నిర్ణయించింది ఫోర్బ్స్ ఇండియా. అయితే తనకు వచ్చిన ఈ గుర్తింపును సోషల్‌మీడియా కుటుంబానికి అంకితమిస్తున్నట్టు తెలిపింది రష్మిక. బ్లూ స్లిట్ వన్ శౌల్డర్ గౌను (blue slit one shoulder gown)లో దిగిన స్టిల్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ..
‘లోపాలు’ , ‘అభద్రతాభావంతో’ పెరగడం గురించి మాట్లాడింది. మనిషిగా మనం లోపాలతో పుడతాం..అభద్రతాభావంతో పెరుగుతాం. కానీ ఈ ప్రపంచం మీకు చెప్పేదాని కన్నా మీరు చాలా పెద్దవారని, మీరు గ్రహించే క్షణం వస్తుంది. మీరు బలమైన, తెలివైన వారని గ్రహించినపుడు, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ పోస్ట్‌లో పేర్కొంది.
Being human – we are born with flaws and grow up with insecurities..But there comes a moment when you realise that you are much bigger than what the world is telling you- you can be..You are stronger, you are wiser, you are smarter.. When you realise this, you become unstoppable. pic.twitter.com/mFLIM1T3z9
— Rashmika Mandanna (@iamRashmika) October 19, 2021
మీపై అధికారం కలిగి ఉండేందుకు ఇతరులకు మీరు అనుమతిస్తారు. కానీ మీ శక్తి మీదే. మీరు మాత్రమే ఎంపిక చేసుకుంటే అది మీదే అవుతుంది. మీరు ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా, సంతోషంగా జీవించవచ్చు. కానీ మాకు ప్రేమ, శ్రద్ధ అవసరం, అనుబంధాలు కావాలి. మనం కేవలం మనుషులం..భావోద్వేగాలే మనకు అన్నీ..అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
ఇది కూడా చూడండి
Rashmika Mandanna | రష్మికకు ఆ పాత్రలో నటించాలని ఉందట..!
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు