చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిన రాశీ ఖన్నా మధ్యలో కాస్త స్లో అయింది. ఇటీవలి కాలంలో ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో వరుస హిట్లను అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిరాశ పర్చింది.
ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. తెలుగులో నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్గా చేస్తోంది. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ చేస్తోంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ అందరి మనస్సులు కొల్లగొడుతుంది.తాజాగా రాశీ ఖన్నా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందాలు ఆరబోసి కుర్రకారుకి హాట్ ఫీస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.