Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
'మా'ఎన్నికల (MAA Elections) తర్వాత జరుగుతున్న పరిణామాలతో మోహన్ బాబు (Mohan Babu) అప్ సెట్ అవుతున్నారట. చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుకునేందుకు మోహన్‌బాబును పిలిచారట.

ఇటీవల జరిగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో (MAA Elections) తనను పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి (Chiranjeevi) అడిగారని మంచు విష్ణు మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ (Prakash Raj)ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విష్ణుకు సూచించారు చిరంజీవి. అయితే ఇదంతా జరిగిపోయింది. ప్రస్తుతం సీన్ అంతా మారిపోయింది. ఇపుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా కూడా చేశారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రకాశ్‌రాజ్ మాత్రం తగ్గేదే అంటూ ముందుకు సాగుతున్నారు.
విష్ణు ‘మా’సంక్షేమం కోసం బాగా పనిచేయాలని, తాము బయటి నుంచి వారిని ప్రశ్నిస్తామని చెప్పుకొచ్చారు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు. విష్ణు టీం మేనిఫెస్టోలో పెట్టిన అంశాల అమలు చేయించడంలో భాగంగా ప్రకాశ్‌రాజ్ పలు ప్రణాళికలతో ముందుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అయితే ‘మా’ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలతో మోహన్ బాబు (Mohan Babu) అప్ సెట్ అవుతున్నారట.
ప్రకాశ్‌రాజ్ టీం వెనుక చిరంజీవి ఉన్నాడని మోహన్‌బాబు అనుకుంటున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా స్పష్టత ఇవ్వాలని భావించిన చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుకునేందుకు మోహన్‌బాబును పిలిచారట. ‘మా’ ఎన్నికల సమరం మొదలయినప్పటి నుంచి మోహన్ బాబు, చిరంజీవి మధ్య పరోక్షంగా నువ్వా..నేనా అన్నట్టుగా మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి, మోహన్ బాబు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో అన్నీ సద్దుమణిగి మాలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

