Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez ) నాలుగోసారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు.

ముంబై: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez ) నాలుగోసారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాలేదు. రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. గత శుక్రవారమే హాజరు కావాల్సి ఉండగా.. ఆమె రాలేదు. తర్వాత శనివారం, సోమవారం కూడా జాక్వెలిన్ డుమ్మా కొట్టింది. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోతున్నట్లు ఈడీ అధికారులకు జాక్వెలిన్ చెప్పడం విశేషం. ఈ మోసం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న సంబంధం, ఆమె ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతోంది.
వచ్చే నెల తొలి వారానికి విచారణను వాయిదా వేయాలని గత శుక్రవారం జాక్వెలిన్.. ఈడీ అధికారులను కోరినా వాళ్లు అందుకు నిరాకరించారు. గతంలో ఒకసారి ఇదే కేసులో జాక్వెలిన్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. తాను ఏ తప్పు చేయలేదని, తాను కూడా సుకేశ్ చంద్రశేఖర్ బాధితురాలినే అని ఆమె ఆ విచారణలో తెలిపింది. ఇదే కేసుకు సంబంధించి మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

