కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీమేల్ లీడ్ చేస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తున్నాడు. అలనాటి తారలు రాధికా శరత్‌కుమార్ (Radikaa Sarathkumar ), ఖుష్బూ సుందర్, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే సినిమా సెట్స్ లో రాధిక, ఊర్వశి హీరోయిన్ రష్మికతో కలిసి సరదాగా డబ్ స్మాష్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రష్మిక పక్కన ఊర్వశి, రాధిక నిల్చొని మహానటి సావిత్రి పాపులర్ తమిళ పాటకు డబ్ స్మాష్ చేస్తుంటే..రష్మిక క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది.
A #Navaratri special performance
— BA Raju's Team (@baraju_SuperHit) October 7, 2021
From the team of #AadavaalluMeekuJohaarlu reminiscing Mahanati Savitri gari song on the sets. @iamRashmika @realradikaa #oorvashi@ImSharwanand @ThisIsDSP @DirKishoreOffl @sujithsarang @SLVCinemasOffl #AMJ pic.twitter.com/23awfNko31
ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిశోర్ తిరుమల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తెరకెక్కించిన రెడ్ బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో ఈ సారి శర్వానంద్‌తో కలిసి మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?