పంటలు ఎండిపోతయ్.. నీళ్లివ్వండి
పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ
- వీణవంక రైతుల వేడుకోలు
వీణవంక, మార్చి 10 : పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ మేరకు మంగళవారం వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బీరన్న దేవాలయం ఆవరణలో విలేకరులతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వీణవంక పెద్ద చెరువు తూముకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు వృథాగా పోతున్నదని వాపోయారు. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాలు సాగవుతున్నాయని, ఈ చెరువుపై సుమారు వెయ్యి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేకపోతే ఎండిపోయి ఎడారిలా మారే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్శాఖ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా బేతిగల్ చెరువును నింపాలని, దాని నుంచి వచ్చే నీటితో వీణవంక చెరువు నిండుతుందని విన్నవించారు. నీటిని విడుదల చేయకుంటే పంటలు ఎండిపోయి, రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. అనంతరం వీణవంక చెరువు వద్ద ఇరిగేషన్ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నీట మొండయ్య, డీ రవీందర్, వేణు రవి, సంపత్, ఎం సమ్మయ్య, రాములు, గెల్లు కొమురయ్య, రంజిత్, శ్రీనివాస్, పోచయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Crops drying
- farmers
- water
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

