రామ్ చరణ్ రంగస్థలం తమిళ ట్రైలర్ రిలీజ్
రామ్ చరణ్ సినిమాలకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. రంగస్థలం సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి సినిమాల్లో ఒకటి రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 2018 మార్చి 30న విడుదలైన రంగస్థలం తెలుగు ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. నాన్ బాహుబలి కేటగిరీలో అన్ని రికార్డులు రంగస్థలం పేరు మీదకి వచ్చాయి. అల వైకుంఠపురంలో వచ్చే వరకు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. మగధీర తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న రామ్ చరణ్‌కు రంగస్థలం రూపంలో మరిచిపోలేని సినిమాను బహుమతిగా ఇచ్చాడు సుకుమార్. ఇక ఈ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలవుతుంది.
అదేంటి..? ఒకసారి విడుదలైన సినిమా మళ్లీ ఎందుకు విడుదల చేస్తున్నారు.. పైగా మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే అనుమానం రావచ్చు. అయితే రంగస్థలం విడుదలవుతుంది తెలుగులో కాదు.. తమిళంలో. రామ్ చరణ్ సినిమాలకు తమిళంలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈయన నటించిన మగధీర, రచ్చ లాంటి సినిమాలు తమిళనాట మంచి వసూళ్లు సాధించాయి. దాంతో చరణ్ నటించిన అన్ని సినిమాలు తమిళంలో అనువదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రంగస్థలం కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాట థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అక్కడ వాళ్ల సినిమాలు కూడా విడుదల కావడం లేదు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రంగస్థలం తమిళ ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు.
రంగస్థలం సినిమా విడుదలైనప్పుడు తమిళనాట కూడా దీని గురించి చర్చ చాలా జరిగింది. అంతేకాదు రంగస్థలం తెలుగు వర్షన్ చెన్నైలో కూడా మంచి వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో డబ్బింగ్ చేస్తున్నారు. మరి మన రంగస్థలం సిట్టి బాబు రీసౌండ్ తమిళంలో ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైరల్ పిక్
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

