గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 13:33:55

అయోధ్య‌లో రామ‌సేతు షూటింగ్‌..!

అయోధ్య‌లో రామ‌సేతు షూటింగ్‌..!

ముంబై: బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఈ మ‌ధ్య ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో భేటీ అయిన సంగ‌తి తెలుసు క‌దా. ఈ సంద‌ర్భంగా త‌న లేటెస్ట్ మూవీ రామ‌సేతు గురించి కూడా ఆయ‌న‌తో చ‌ర్చించాడు. ఈ సినిమాను స‌హ‌జంగా చిత్రీక‌రించాల‌నుకుంటున్న చిత్ర యూనిట్‌.. అయోధ్య‌లోనూ షూటింగ్ జ‌ర‌పాల‌ని భావిస్తోంది. ఇదే విష‌యాన్ని యోగితో స‌మావేశం సంద‌ర్భంగా అక్ష‌య్ ప్ర‌స్తావించిన‌ట్లు ముంబై మిర్ర‌ర్ వెల్ల‌డించింది. రామ‌సేతు అనేది నిజ‌మా, క‌ల్ప‌నా అని తెలుసుకునే ఓ క‌థానాయ‌కుడి క‌థే ఈ రామ‌సేతు. వ‌చ్చే ఏడాది యూపీలో షూటింగ్ జ‌ర‌పాల‌ని సినిమా యూనిట్ భావిస్తోంది. డైరెక్ట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తోపాటు అక్ష‌య్ కుమార్ ఈ సినిమాను అత్యంత స‌హ‌జంగా చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నారు. దీపావ‌ళి స‌మ‌యంలో ఈ రామ‌సేతు పోస్ట‌ర్‌ను అక్ష‌య్ తొలిసారి రివీల్ చేశాడు. 


logo