టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) చాలా కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్ తో బిజీ అయిపోయాడు. మొత్తానికి ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తయింది. ఇక రాంచరణ్ కు విరామం దొరికింది.
గత ఆదివారం చిరంజీవి నివాసంలో మెగా కుటుంబసభ్యులంతా రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక రాంచరణ్ ప్రస్తుతం తన సోదరీమణుల కోసం సమయం కేటాయించాడు. వారిని రాఖీ స్పెషల్ లంఛ్ డేట్ కు తీసుకెళ్లాడు. రాంచరణ్ తన సిస్టర్స్ సుస్మిత (Sushmita), శ్రీజ (Sreeja), నిహారిక (Niharika) తో ఇవాళ స్పెషల్ లంఛ్ డేట్ కు వెళ్లాడు. లంఛ్ డేట్లో మెగా వారసులంతా స్టైలిష్ గా ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నారు.
రాంచరణ్ ముగ్గురు సిస్టర్స్ తో కలిసి దిగిన ఫొటో ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ కారణంగా తన అక్కాచెల్లెళ్లకు దూరమైన రాంచరణ్ మొత్తానికి ఆలస్యంగానైనా ఇలా వారికి ట్రీట్ ఇచ్చి రాఖీ వేడుకల్లో పాల్గొనడంతో..మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు, ఫాలోవర్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
Post #RRRMovie shoot, Megapower Star @AlwaysRamCharan takes his sisters for a weekend lunch to celebrate Raksha Bandhan. #RamCharan@sushkonidela @IamNiharikaK #SreejaKalyan pic.twitter.com/PFQCCzPSyA
— BA Raju's Team (@baraju_SuperHit) August 29, 2021
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర