Ram Charan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లోస్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషనల్ ప్లాన్‌తో పుల్ బిజీగా ఉంది గేమ్ ఛేంజర్ టీం. కాగా రాంచరణ్ ప్రఖ్యాతి గాంచిన ఏపీలోని కడప దర్గాను సందర్శించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 18న జరుగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్‌కు రాంచరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నాడు.
ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుందని టాక్. మరోవైపు రాంచరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతో చేయబోయే ఆర్సీ 16 షూటింగ్లో జాయిన్ కావాల్సి ఉంది. ఆర్సీ 16 మైసూర్ షెడ్యూల్‌కు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాజోలు సుందరి అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట