స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 (RC15) వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది. పూణేలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ మొదలుపెట్టింది శంకర్ టీం. రాంచరణ్ తన కారులో నుంచి లొకేషన్లో దిగుతున్న స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. స్టిల్‌లో దిల్ రాజు కూడా కనిపిస్తున్నారు.
తాజా షెడ్యూల్లో రాంచరణ్, కైరా అద్వానీ (Kiara Advani)పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనుంది. ఓ పాటతోపాటు టాకీ పార్టును ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. సుమారు 3 వారాలపాటు షూటింగ్ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో సునీల్ (Sunil)ను కీలక పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న RC15లో అంజలి, జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తుండగా..ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన బాయ్స్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన థమన్ సుదీర్ఘ విరామం తర్వాత శంకర్‌తో కలిసి పనిచేయడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత