Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత విహారయాత్రలకు బయలుదేరింది. తన స్నేహితురాలితో కలిసి ప్రత్యేకంగా డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన సమంత బన్నీ కూతురు అర్హపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంతో అల్లు అర్హ వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతుంది .ఈ చిత్రంలో అల్లు అర్హ నటనకు ముగ్ధురాలైన సామ్ తనపై ప్రశంసల వర్షం కురిపించింది.
`అల్లు అర్హ జన్మతః రాక్ స్టార్ గా పుట్టిందని..తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుందని.. అలాంటి అర్హ నా సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుందని పేర్కొంది సమంత. భవిష్యత్తులో అల్లు అర్హ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని స్టార్ కిడ్ ఫ్యూచర్ ని చెప్పేసింది సామ్. అర్హ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, చిత్రంలో యువరాజు భరతుడిగా కనిపించబోతోంది అర్హ.
ఇండస్ట్రీలో ఎందరినో బాలనటులుగా పరిచయం చేసిన సీనియర్ దర్శకులు గుణశేఖర్ అర్హను కూడా తెరకు పరిచయం చేస్తున్నారు. వారం పదిరోజుల పాటు అర్హపై చిత్రీకరణ సాగింది. అర్హకు ఎలాంటి కష్టం లేకుండా ఫాల్కన్ బస్ని అల్లు అర్జున్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక డ్రామా శాకుంతలం. సమంతతో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- arha
- Gunasekhar
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

