Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో ఆర్సీ 15గా వస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer)తోపాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో నటిస్తోన్న RC16 సినిమాలున్నాయి. ఇప్పటికే గేమ్ ఛేంజర్ ఫినిషింగ్ టచ్‌లో ఉండగా.. ఈ సినిమా విడుదల కాకముందే చాలా రోజులకు ఆర్సీ 16 అప్డేట్ను ఓ స్టిల్ రూపంలో అందరితో పంచుకున్నాడు రాంచరణ్.
బ్లాక్ టీ షర్ట్ అండ్ షార్ట్‌లో యెల్లో గ్రీన్ షూ వేసుకున్న చరణ్ ఫిట్నెస్ కోచ్ శివోహం వైపు వస్తున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. బీస్ట్ మోడ్ ఆన్.. ఆర్సీ 16 లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మొత్తానికి రాంచరణ్ ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నానని చెప్పకనే చెబుతున్నాడు. రాంచరణ్ తాజా స్టిల్‌తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్సీ 16 మూవీ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ కాగా.. ఇప్పటికే ఈ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండబోతున్న ఆర్సీ 16లో రాంచరణ్ కథానుగుణంగా ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడట. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్సీ 16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది