Ram Charan | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) నటుడు రామ్ చరణ్ (Ram Charan) పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. సోషల్ మీడియా (Social Media), పలు వార్తా సంస్థల్లో (News Websites) చరణ్ పేరు ట్రెండింగ్ (Trending)లో ఉంటోంది. అమెరికా (America)లోనే అత్యంత ఫేమస్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టాక్ షో (Good Morning America Talk Show))లో పాల్గొన్న తొలి తెలుగు వ్యక్తిగా చరణ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియా (California) వేదికగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (Hollywood Critics Association Awards 2023) వేడుకలోనూ రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశారు. ఈ వేడుకలో చరణ్ అవార్డుల ప్రెజంటర్ (award presenter)గా పాల్గొని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరును మరో స్థాయికి చేర్చారు.
ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చరణ్‌పై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra ) సైతం చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ ఓ గ్లోబల్ స్టార్ (global star) అంటూ కితాబిచ్చారు. కాగా, ఆనంద్ మహీంద్రా (Anand Mahindra ) ప్రశంసల పట్ల తాజాగా చరణ్ స్పందించారు. ‘థ్యాంక్యూ సో మచ్ సర్. ఇప్పుడు టైం ఇండియాదే. ప్రతి రంగంలోనూ ప్రకాశిస్తోంది’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా నత్తా చాటుతున్న ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి అవార్డుల పంట పండుతోంది.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న మరో 5 అంతర్జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన
హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఐదు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్
సినిమా అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్
ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్పాట్లైట్ విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గానూ రాజమౌళి (SS
Rajamouli)టీమ్ అయిదు అవార్డులు అందుకొని అంతర్జాతీయ వేదికపై విజయకేతనం ఎగురవేశారు.
This man is a Global Star. Period. #NaatuNaatu @AlwaysRamCharan https://t.co/JcanE3OJmq
— anand mahindra (@anandmahindra) February 25, 2023
Thank you so much Sir!
It’s India’s time now to shine in every field and form 🙏— Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023
Also Read..
Ram Charan | టైటిల్ కోసం కసరత్తు
Joseph Manu James | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత
RRR | హెచ్‌సీఏ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ టీం సందడి.. పిక్స్ వైరల్..!
Ram Charan | విశ్వవేదికపై చరణ్‌కు క్షమాపణలు చెప్పిన అమెరికన్ స్టార్ నటి..!