Tirumala | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): చంద్రగ్రహణం మార్చి 3న మధ్యా హ్నం 3.20 గంటలకు ప్రారంభమై, సాయం త్రం 6.47 గంటలకు పూర్తవుతుందని టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుమారు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు పేర్కొన్నది. భక్తులకు శ్రీవారి దర్శనం 8:30 గంటల నుంచి పునః ప్రారంభమవుతుందని వివరించింది. చంద్రగ్రహణం కారణంగా అష్టదళపాద పద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్టు వెల్లడించింది.