‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కథానాయిక సమంత. ఆ సినిమాలో జెస్సీ పాత్రలో యువతరాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్డమ్ను సంపాదించుకుంది. అగ్రహీరోలందరితోనూ జతకట్టి ఎన్నో విజయాల్ని ఖాతాలో వేసుకుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమా విడుదలై 13 ఏండ్లు అవుతున్నది. ఈ సందర్భంగా సినీ రంగంలో తన ప్రయాణం గురించి సమంత ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ప్రేక్షకులు కనబరచిన ప్రేమాభిమానాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని, వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని పేర్కొంది.
‘సినీరంగంలోకి ప్రవేశించి పదమూడేండ్లు గడచిపోయినా ఇప్పుడే ప్రయాణాన్ని మొదలుపెట్టాననే భావన కలుగుతున్నది. మీరు అందించిన ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి’ అని సమంతా పే ర్కొంది. కొద్ది మా సాల క్రితం మయోసైటిస్ అనే కండరాల వ్యా ధి బారిన పడిన సమంత ప్రస్తు తం కోలుకుంటున్నది. ఆమె ప్రధాన పాత్ర లో నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదలకానుంది.