చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్ (Ram Charan)..ఒకరు మెగాస్టార్..మరొకరు మెగాపవర్ స్టార్..ఈ తండ్రీ కొడుకులిద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. మూవీ లవర్స్ మాట అటుంచితే మెగా అభిమానులకు మాత్రం పండుగే అని చెప్పాలి. చిరంజీవి నటిస్తోన్న ఆచార్య (Acharya)లో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరు, రాంచరణ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ..ఇంటర్వ్యూలు షురూ చేశారు.
ఇటీవలే చేసిన ఓ చిట్ చాట్‌లో రాంచరణ్ తన తండ్రితో కలిసి ఆచార్యలో నటించిన అనుభవాలను పంచుకున్నాడు. సినిమాలో నటించడమే కాదు షూటింగ్ అవుతున్నంత సేపు చిత్ర నిర్మాణ వ్యవహారాల్లో ప్రతీ నిమిషం చిరంజీవితో కలిసి ఉండటం చాలా బావోద్వేగపూరితమైన విషయమన్నాడు రాంచరణ్.
డాడీ, నేను కలిసి డిన్నర్ చేసేవాళ్లం. ఆ తర్వాతి రోజు కలిసి పని చేసేందుకు రెడీ అయ్యేవాళ్లం. సెట్స్ లో కలిసి పనిచేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరం కలిసి ఇంటి వచ్చేవాళం. ఈ క్షణాలు చాలా మధురమైనవని..నాన్నతో ప్రయాణం చేస్తున్న సమయం..నా ఫీలింగ్స్ ను ఎలా ఎక్సెప్రెస్ చేయాలో తెలియని సందర్భం. నాన్న నన్ను హత్తుకున్నపుడు నాకు కన్నీళ్లు వచ్చాయని ఎమోషనల్ అయ్యాడు రాంచరణ్.
మరోవైపు ఈ క్షణాలను మేము ఎప్పటికీ తిరిగి పొందలేము, చరణ్, ఈ ప్రయాణంలో ఉండడం వరంలాంటిదని నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు చిరు.