Game Changer Teaser | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక టీజర్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం కౌంట్ డౌన్ షురూ అంటూ ఆసక్తికర పోస్టర్ ఒకటి విడుదల చేశారు మేకర్స్.
75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పేలుడు శక్తి ఆవిష్కృతం కాబోతుంది. గేమ్ ఛేంజర్ టీజర్ బాణసంచా త్వరలో.. అంటూ సూట్లో ఉన్న రాంచరణ్ కుర్చీపై కూర్చుండగా.. రౌడ్ గ్యాంగ్ అతడివైపు దూసుకొస్తున్నారు. ఇప్పుడీ పోస్టర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే జరగండి జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్స్ లాంచ్ చేయగా నెట్టింట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని 2025 జనవరి 10న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాబోతున్న గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మ్ ఛేంజర్ టీజర్ పోస్టర్..
Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥
The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ— Game Changer (@GameChangerOffl) October 27, 2024
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?