Bollywood cinema |ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చచ్చిపోవాలనుకున్న బాలీవుడ్ దర్శకుడు
Bollywood cinema |బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తన సినిమా ఒకటి ఫ్లాప్ కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం. ఇక్కడ హిట్స్ ఎవరికీ శాశ్వతం కాదు.. అలాగే ఫ్లాపులు కూడా ఎవరికీ శాశ్వతం కాదు. రెండింటినీ సమానంగా స్వీకరించాలి. ఒక ఫ్లాప్ పడగానే కెరీర్‌కు శుభం కార్డు పడిపోదు. కానీ ఓ బాలీవుడ్ దర్శకుడు మాత్రం తన సినిమా ఒకటి ఫ్లాప్ కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి హిట్ సినిమాలు తీసిన రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా.
అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్‌తో ఢిల్లీ-6 సినిమా తీశాడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. ఆమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన రంగ్ దే బసంతి సినిమా హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండేవి. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఓం ప్రకాశ్ మెహ్రా పూర్తిగా డైలామాలో పడ్డాడు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఆ క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాడు. ఆ పరాజయం అంతగా కుంగదీసిందని తన ఆటోబయోగ్రఫీలో తెలిపాడు. సినిమా ఫలితం చూసిన తర్వాత ఆల్కహాల్‌కు బానిస కూడా అయిపోయాడు. చనిపోయేవరకు అలాగే తాగుతూ ఉందామని అనుకున్నాడట. అయితే తన కుటుంబసభ్యులు, స్నేహితులు మళ్లీ తనని మామూలు మనిషిని చేశారని పేర్కొన్నాడు ఓం ప్రకాశ్ మెహ్రా.
తాజాగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన తుఫాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు అన్నీ మూతపడటంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తుఫాను పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

