ప్రభాస్-పూజాహెగ్డే కాంబినేషన్ లో వస్తోన్న మూవీ రాధేశ్యామ్. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. 4 రోజుల ప్యాచ్ వర్క్‌లో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో షూటింగ్ రీస్టార్ట్ అయిందని టాక్. మేకర్స్ కొన్ని టాకీ సీన్లతోపాటు ప్రభాస్-పూజాహెగ్డేపై లవ్ సాంగ్ షూట్ చేయడంతో మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
పాన్ ఇండియా లెవల్ స్టోరీగా వస్తున్న రాధేశ్యామ్ వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. యూవీ క్రియేషన్స్ అండ్ టీ సిరీస్ బ్యానర్స్ సంయుక్తంగా రాధేశ్యామ్‌ను తెరకెక్కిస్తున్నాయి. రాధేశ్యామ్ విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ మరోవైపు సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్