ఉప్పెన సినిమాతో గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యువ హీరో సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో నాలుగో చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ మూవీ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ PVT 4 ప్రాజెక్టు గ్లింప్స్ వీడియో (PVT4 Glimpse Video)ను విడుదల చేశారు.
‘రేయ్ రాముడు లంక మీద పడటం ఇనుంటావ్..అదే పది తలకాయలు ఊడి అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా..అని విలన్ అంటుంటే..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప..ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు..తలలు కోసి చేతికిస్తా నా యాళ..’అంటూ వైష్ణవ్ తేజ్ చెప్తున్న డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్రొడక్షన్ నంబర్ 16గా వస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రానికి కథ-దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ పక్కా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తాజా వీడియోతో చెప్పేశాడు డైరెక్టర్. టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీలో సముద్రఖని విలన్‌గా కనిపించబోతున్నాడని అనుకుంటున్నారు.. విలన్ వాయిస్ ఓవర్ విన్న సినీజనాలు. విలన్ ఎవరనేదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పక్కా మాస్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
#PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨
Shoot begins soon! 🎬🎥
Directed by #SrikanthNReddy
Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4CinemasSankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm
— Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!