ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఇంట కవలలు అడుగుపెట్టారు. చిన్మయి-రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దంపతులు ఇటీవలే కవలల (twins) కు వెల్కమ్ చెప్పారు. అయితే సరోగసి ద్వారా చిన్మయికి కవలలు పుట్టారంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. వీటికి
తెరదించుతూ..నెట్టింట పోస్ట్ పెట్టింది చిన్మయి. మా కవలలు.. పాప, బాబు. సరోగసి (Surrogacy) ద్వారా పిల్లలకు స్వాగతం పలికానంటూ ఇన్ స్టాగ్రామ్‌లో చాలా మంది నన్ను అడుగుతూ సందేశాలను పెట్టారు. మెటర్నిటీ డైరీస్‌లో నాప్రెగ్నెన్సీ ఫొటోలను పోస్ట్ చేయకపోవడం వల్లెనేమో ఇలా జరిగి ఉంటుంది.
‘నాతో సన్నిహితంగా ఉండేవాళ్లు, నేను గోప్యంగా ప్రొటెక్టివ్‌గా ఉండటానని తెలిసినవాళ్లకు మాత్రమే నా ప్రెగ్నెన్సీ విషయం తెలుసు. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం, స్నేహితుల పట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. బయటి పిల్లలలాగే మాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఉండవు. మీరు తెలుసుకోవాల్సిన విషయమేంటంటే..నేను సిజేరియన్ జరుగుతున్నపుడు నా కవల పిల్లలు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యే ముందు భజన పాటను పాడాను. మీకు ప్రస్తుతానికి ఇది చాలు. మరిన్ని విషయాలు తరువాత’ అంటూ సందేశంలో రాసుకొచ్చింది.
దక్షిణాది నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్-సింగర్ చిన్మయి శ్రీపాద మొదట స్నేహితులుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ ఇద్దరు డేటింగ్ అనంతరం 2014 మే 5న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పిల్లలకు దృప్తా,శర్వాస్ అని పేర్లు పెట్టినట్టు టాక్.