చివ్వెంల ఫిబ్రవరి 19 : తాను ప్రేమించిన యువతి దూరం పెడుతున్నదన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్లో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మం డలం అలుగునూరుకు చెందిన ఎల్ఎల్బీ విద్యార్థిని పట్టేటి స్పందన రెండు రోజుల క్రితం స్నేహనగర్లో ఉంటున్న అక్కాబావల ఇంటికి వచ్చింది.
విషయం తెలుసుకున్న లిం గంపల్లికి చెందిన బోయిండ్ల మహేశ్ ప్రేమ విషయమై ఆమెతో గొడవపడి సుత్తితో తలపై బాదడంతో తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. యువతి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తె లిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సై మ హేశ్వర్, క్లూస్ టీమ్ సందర్శించారు.