వామ్మో పెద్దపులి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో మూగజీవాలపై దాడి చేసింది. దీంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు.
- సిరిసిల్లలో జిల్లాలో మూడు రోజులుగా బెంబేలు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/ తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో మూగజీవాలపై దాడి చేసింది. దీంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు.
పులి సంచరించిన ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం తంగళ్లపల్లి శివారులో రైల్వే పనులు చేస్తున్న కూలీలకు పెద్దపులి కనిపించడంతో పరుగులు తీశారు. గురువారం అటవీ అధికారులు పంట పొలాల్లో పులి పాదముద్రలను ధ్రువీకరించారు. అలాగే తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె మానేరు నది తీరం వెంట గుట్టలలో పెద్దపులి కనిపించిందని మత్స్యకారులు తెలుపడంతో అధికారులు పరిశీలించారు. పాదముద్రలు పెద్ద పులివేనని స్పష్టం చేశారు.
ఎఫ్ఆర్వో కల్పనాదేవి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రెండు రోజుల వరకు పొలాల వద్దకు వెళ్లవద్దని రైతులకు సూచించారు. పెద్ద లింగాపూర్ గ్రామ శివారు నుంచి పెద్దపులి ఇటువైపు వచ్చిందని, ట్రాప్ చేయడానికి కెమెరాలు, రెస్యూ టీం, డీఎఫ్వో బాలమణి, సిబ్బంది అకడే ఉండి గమనిస్తున్నారని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

