న్యూఢిల్లీ: నెవిటేర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల 45 నిమిషాలపాటు భారత్‌లోని పలు విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 నిమిషాలకు బుకింగ్, చెక్ఇన్ సమయంలో ఈ సమస్యను అధికారులు గుర్తించారు. అయితే సమస్యను గంటలోపే పరిష్కరించారు.
కాగా, ఈ సమయంలో అధికారులు బుకింగ్, చెక్ఇన్లను మాన్యువల్‌గా నిర్వహించారు. ఈ సమస్య వల్ల పలు విమానాశ్రయాల్లో భారీగా ప్రయాణికుల రద్దీ కనిపించింది. రిజర్వేషన్లు, చెక్ఇన్, బోర్డింగ్ కోసం ఎయిర్‌లైన్ టెక్నాలజీని నెవిటేర్ అందిస్తున్నది. దీంట్లో సమస్య ఏర్పడితే ప్యాసింజర్ వివరాలను ప్రాసెస్ చేయడంలో తీవ్ర అంతరాయం కలుగుతుందని ఓ అధికారి తెలిపారు.