Pushpa 2 | విడుదలకు ముందే నాలుగు వందల కోట్ల ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది. 2021 డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీలో 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌ను చూసి ఒక పెద్ద నిర్మాణ సంస్థ.. పుష్ప టీమ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ సినిమా.. ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా తెలుగులో మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటికే బాలీవుడ్లో బన్నీకి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఇంతకుముందు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్.. మొదటిసారి దండయాత్ర చేశాడు. అలాగే కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా పుష్ప సంచలన విజయం సాధించింది. పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ రికార్డుల పర్వం చూసిన తర్వాత పుష్ప 2 కోసం ఒక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఏకంగా 400 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అది కూడా కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనం. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో 400 కోట్ల ఆఫర్‌ను కూడా మైత్రి మూవీ మేకర్స్ వదులుకుంది. సినిమా విడుదలకు ఇన్ని నెలల ముందే 400 కోట్ల ఆఫర్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఐకాన్ స్టార్ మార్కెట్‌కు ఇది నిదర్శనం. రెండో భాగం పుష్ప ది రూల్.. మొదటి పార్ట్ కంటే అద్భుతంగా వస్తుందని లెక్కల మాస్టర్ సుకుమార్ ధీమాగా చెబుతున్నారు. సినిమాపై ఉన్న ఆ నమ్మకంతోనే వందల కోట్ల ఆఫర్‌ను కూడా నిర్మాతలు వదిలేసుకున్నారు. ఏదేమైనా.. పుష్ప 2 సినిమాకు వచ్చిన ఆఫర్ గురించి ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
శ్రీవల్లిలా ఉండండి.. పుష్పలా మాత్రం అస్సలు ఉండకండి.. ఎందుకో తెలుసా?
‘పుష్ప’లో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో కనిపించిన జగదీశ్ ప్రతాప్ బండారి …
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?