తెలుగు బ్లాక్‌బ్లస్టర్ మూవీ ‘పుష్ప’. ఇది హిందీలో కూడా భారీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో పాపులర్ అవడానికి గల కారణాల్లో అల్లు అర్జున్‌కు వాయిస్ ఇచ్చిన శ్రేయాస్ తాల్పడే కూడా ఒకడు. తెలుగులో అల్లు అర్జున్ పలికించిన అన్ని హావభావాలనూ శ్రేయాస్ తన గొంతులో హిందీలో పలికించాడు.
దీంతో ఈ చిత్రం హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే ఇప్పుడు ఇంత సక్సెస్ చూసిన శ్రేయాస్‌ను ఒకప్పుడు ‘వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావు పో’ అన్నారట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. స్టగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పుడు వాయిస్ ఆర్టిస్ట్‌గా పనిచేసేందుకు తాను వెళ్లానని, కానీ తన గొంతు బాగాలేదని రిజెక్ట్ చేశారని శ్రేయాస్ గుర్తుచేసుకున్నాడు.
ఇప్పుడు ‘పుష్పరాజ్’గా తన గొంతుతో ఈ చిత్రం సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ విజయంలో తన పాత్ర ఏమీ లేదని, తన పని మాత్రమే తాను చేశానని మర్యాదగా చెప్తున్నాడు. అంతేకాదు, అల్లుఅర్జున్ అద్భుతంగా నటించాడని, ఆయన హావభావాల వల్ల తన పని మరింత సులువైందని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన హిందీ వెర్షన్ ‘పుష్ప’ అక్కడ కూడా మంచి వ్యూయర్షిప్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Lahron se darkar nauka paar nahi hoti…koshish karne walon ki kabhi haar nahi hoti.#MakarSankranti ki sabhi ko dher सारी शुभकामनाएं 🙏
— Shreyas Talpade (@shreyastalpade1) January 14, 2022
तिळगुळ घ्या आणि गोड गोड बोला 🪁 pic.twitter.com/PH6yCykePS