Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

Samantha Item song | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన రూటు మొత్తం మార్చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకుంటుంది. కేవలం టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని ఇలా అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి సమంతకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. వీటిలో చాలా వాటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది కూడా. విడాకుల తర్వాత సామ్ కెరీర్ ముగిసిపోతుందని అంతా భావించారు.. కానీ రెట్టింపు ఉత్సాహంతో ఆమె సినిమాలను ఒప్పుకుంటూపోతుంది. అంతేకాదు కెరీర్లోనే తొలిసారిగా ఐటెంసాంగ్‌లో కూడా స్టెప్పులేసింది సమంత. ఈ సాంగ్ యూట్యూబ్‌ను ఊపేసింది. దీంతో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌కు సామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది.
సకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అని సాగే ఈ పాట కుర్రకారుకు పిచ్చెక్కించింది. యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ 73 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మొత్తం మీద పుష్ప సినిమా సక్సెస్‌లోనూ కీలక పాత్ర పోషించింది సమంత స్పెషల్ సాంగ్. అందుకే ఈ క్రేజ్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా పూరీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఈ పాట కోసం ఎవరైనా కథానాయికను తీసుకోవాలని లైగర్ యూనిట్ భావించింది. ఈ క్రమంలో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా సాంగ్ సూపర్ హిట్ కోవడంతో లైగర్ సినిమాలో కూడా సమంతతోనే స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇదే విషయమై లైగర్ యూనిట్ సమంతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ కూడా తనకున్న చనువుతో సమంతను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సమంత ఇద్దరూ మహానటి సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. మరి విజయ్ దేవరకొండ మాట మన్నించి సమంత ఈ ఐటెం సాంగ్ ఒప్పుకుంటుందా? లేదా? అనేది చూడాలి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Samantha | ప్రెగ్నెంట్‌గా సమంత .. డేరింగ్ స్టెప్ తీసుకుంటున్న సామ్
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్‌గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
Samantha Fitness Secret | వార్నీ సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదా.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

