Samantha | ప్రెగ్నెంట్‌గా సమంత .. డేరింగ్ స్టెప్ తీసుకుంటున్న సామ్

Samantha to play pregnant role | సమంత ప్రెగ్నెంట్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ చాలా బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తోంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా.. ఒక్క ఇండస్ట్రీని కూడా వదిలిపెట్టకుండా అన్నిచోట్లా జెండా పాతేస్తుంది సమంత. ఈమె జోరు చూసి ట్రేడ్ పండితులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ఊహించిన దానికంటే వేగంగానే మొదలు పెడుతుంది సమంత. ఇదిలా ఉంటే ఈమె గర్భవతి అనే విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దాని వెనుక ఒక చిన్న కథ ఉంది.
ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తూ ఉంది. అందులో యశోద కూడా ఒకటి. పూర్తిస్థాయి ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుంది. హరి-హరీష్ దర్శక ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఇందులో సమంత గర్భవతి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అనుకోని సమస్యలు ఎదురైతే ఒంటరిగా ఆమె వాటిని ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. యశోద ఖచ్చితంగా తన కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని సమంత భావిస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 3 కోట్ల పారితోషికం అందుకుంటుంది సమంత. దీంతోపాటు ఒక తమిళ సినిమా.. మరొక ఇంటర్నేషనల్ ప్రాజెక్టు సైన్ చేసింది సమంత. ఏదేమైనా విడాకుల తర్వాత సమంత కేరీర్ విల్లు నుంచి వదిలిన బాణంలా దూసుకుపోతుంది.
బాలీవుడ్లో మూడు సినిమాలకు సైన్ చేసిన సమంత.. ఏ నిర్మాణ సంస్థ అంటే..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Samantha Fitness Secret | వార్నీ సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదా.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు
Samantha | బికినీలో సెగలు పుట్టిస్తున్న సమంత..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

