Samantha | విడాకుల తర్వాత సమంత కెరీర్ అందరూ డౌన్ అవుతుందని అంచనా వేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె కెరీర్ పైపైకి వెళుతుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే సినిమాలు చేసిన సమంత.. ఇప్పుడు హిందీలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది. అక్కడి నుంచి కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీమాన్ సీజన్ 2 విడుదలైన తర్వాత సమంత పేరు బాలీవుడ్లో మార్మోగిపోతోంది. అందులో రాజి పాత్రలో ఆమె నటించిన తీరు బాలీవుడ్ విశ్లేషకులను కట్టి పడేసింది.
అక్కడ అగ్ర నిర్మాణ సంస్థలు సమంతతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నాయి. పైగా అందాల ఆరబోతలో కూడా సమంతకు పెద్దగా పట్టింపులు లేవు. ఇది కూడా బాగా కలిసొస్తుంది. అందుకే బాలీవుడ్లో కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఈమెతో వరుస సినిమాలు నిర్మించడానికి కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సమంత కూడా వాటిపై ఆసక్తి చూపిస్తుంది. విడాకులకు ముందు హిందీ సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపించిన సమంత.. ఇప్పుడు మాత్రం అటువైపు అడుగులు వేస్తోంది. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ మాజీ అక్కినేని కోడలికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు సమంతతో చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితే సమంత బాలీవుడ్ ఎంట్రీకి ఇంత పెద్ద గొప్ప ప్లాట్‌ఫామ్ మరొకటి దొరకదు. మరోవైపు ఫ్యామిలీమాన్ 2 దర్శక ద్వయం రాజ్ డి.కె సమంతతో సోలో వెబ్ సిరీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఇది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తన కెరీర్ తనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకుంటుంది సమంత.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
కొనసాగుతున్న బంగార్రాజు బాక్సాఫీస్ వేట.. 50 కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ..
Allu Arjun | హిందీలో ‘అల వైకుంఠపురములో’.. విడుదల ఎప్పుడంటే?