Naga Chaitanya | టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంత.. ఇద్దరూ గత సంవత్సరం అక్టోబర్‌లో విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో సమంత.. తన విడాకుల విషయం గురించి ప్రస్తావించింది. కానీ.. నాగ చైతన్య మాత్రం స్పందించలేదు.
తొలిసారి బంగార్రాజు ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య.. తన విడాకుల గురించి స్పందించాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ జీవితంలో ఈ మధ్య కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా.. దాని గురించి చెప్పండి అంటూ అడిగిన ప్రశ్నకు సపరేట్ అవ్వడం వల్ల పోయేదేం లేదు. అది ఇద్దరం కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. ఇద్దరి వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న నిర్ణయం అది. తను హ్యాపీ అంటే.. నేనూ హ్యాపీ. ఆ సమయంలో విడాకులు తీసుకోవడమే కరెక్ట్ అనిపించింది. అందుకే.. ఆ నిర్ణయం తీసుకున్నాం.. అని నాగ చైతన్య సమంతను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
చైతూ, సామ్.. ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకే తమ బంధానికి పుల్‌స్టాప్ పెట్టారు. తాము విడిపోతున్నట్టు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.