‘అఖండ’ (Akhanda) సినిమా అఖండ విజయం సాధించడంతో నిర్మాతలకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఈ నమ్మకంతోనే పుష్ప (Pushpa) సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్నాడు పుష్ప. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.
ఇక బుక్ మై షోలో పుష్ప సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇది ఒక రికార్డు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ రెస్పాన్స్ బట్టి అర్థమైపోతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. అల్లు అర్జున్ అభిమానులతోపాటు.. కామన్ ఆడియెన్స్ కూడా పుష్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంలో నర్తించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. పైగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటిని చూసిన తర్వాత పుష్ప సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది.
అన్నింటికీ మించి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ చేసిన సినిమా ఇది. మరోవైపు అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన తర్వాత బన్నీ నటించిన సినిమా ఇదే. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది 5 షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా బుక్ మై షో యాప్ లో ఇదివరకు ఎప్పుడూ లేని రికార్డులు తిరగ రాస్తున్నారు అల్లు అర్జున్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’