Deep Sidhu | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్దూ కన్నుమూశారు. హరియాణాలోని సోనిపట్ వద్ద కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. మంగళవారం రాత్రి 9 30 గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడని సోనిపట్ పోలీసులు వెల్లడించారు.
2021లో ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో సిద్ధూ నిందితుడిగా ఉన్నాడు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది జనవరి 26న ఎర్రకోట వద్ద రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసం వెనుక దీప్ సిద్దూ ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఆయనపై కేసు పెట్టి అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనతో దీప్ సిద్దూ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాడు.
1984లో పంజాబ్‌లోని ముక్తసర్లో దీప్ సిద్ధూ జన్మించాడు. న్యాయ విద్య అభ్యసించిన సిద్ధూ.. మోడలింగ్‌వైపు అడుగులు వేశాడు. కింగ్ ఫిషర్ మోడల్ హంట్‌తో పాటు గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత మోడలింగ్‌ను వదిలేసి తిరిగి న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. డిస్నీ, సోని పిక్చర్స్, ఇతర హాలీవుడ్ స్టూడియోలకు న్యాయ సేవలు అందించాడు. ఆ తర్వాత బాలాజీ టెలిఫిలింస్‌కు లీగల్ హెడ్‌గా దీప్ సిద్ధూ పనిచేశాడు. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన రామ్తా జోగి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీప్ సిద్దూ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌కు మద్దతుగా ప్రచారం చేశాడు. ఆ తర్వాత 2021లో రైతుల ర్యాలీకి మద్దుతగా నిలిచి.. వార్తల్లోకి ఎక్కాడు.
Read More :
DJ Tillu Collections | డీజే టిల్లు లేటెస్ట్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలి..?
అల్లు అర్జున్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాళవిక మోహనన్
Ananya Nagalla | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న వకీల్‌సాబ్ బ్యూటీ
అల్లు అర్జున్ ఫ్యాన్ లిస్టులో మరో స్టార్ హీరో.. బన్నీ నటనకు బాలీవుడ్ ఫిదా..