Ananya Nagalla | మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నాయిక అనన్య నాగళ్ల. తొలి చిత్రంతోనే క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. వకీల్‌సాబ్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. పవర్ స్టార్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తుంది అనన్య నాగళ్ల. ట్రెండీ దుస్తులు, మేకోవర్‌తో ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ కోలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది అనన్య నాగళ్ల. హీరో శశికుమార్ నటిస్తున్న చిత్రంలో నాయికగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని తంగమ్ పా శరవణన్ తెరకెక్కిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీ తనకు రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆశిస్తోంది అనన్య నాగళ్ల. ప్రస్తుతం సమంత ఇతిహాస చిత్రం శాకుంతలంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది అనన్య నాగళ్ల.
Read More :
“Ananya Nagalla | అనన్య నాగళ్ల మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా..”
“Ananya Nagalla | ఎల్లో డ్రెస్‌లో అదిరిపోయిన వకీల్ సాబ్ ముద్దుగుమ్మ అనన్య..”
గ్లామర్ రంగంలో అందరి సంగతేమో కానీ.. నా విషయంలో జరిగింది ఇదే”
వకీల్‌సాబ్‌లో అనన్యకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే.?”
Ananya Nagalla | అనన్య నాగళ్ల మత్తెక్కించే అందాలకు కుర్రకారు ఫిదా..