అల్లు అర్జున్ ఫ్యాన్ లిస్టులో మరో స్టార్ హీరో.. బన్నీ నటనకు బాలీవుడ్ ఫిదా..
Mithun Chakraborthy praises Allu arjun | ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాహుబలి సినిమాకు ముందు తెలుగు సినిమాలను తక్కువగా చూసే వాళ్లు బాలీవుడ్ స్టార్స్. మన మార్కెట్ దాదాపు వాళ్లతో సమానంగా ఉన్న కూడా ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చేది. కానీ బాహుబలి సినిమా తర్వాత వాళ్ల కంటే మనమే గొప్ప అని ఉత్తరాది దర్శక నిర్మాతలతో పాటు హీరోలకు కూడా బాగా అర్థమైంది. అందుకే అప్పటి నుంచి సౌత్ జపం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఏ బాలీవుడ్ స్టార్‌ను అడిగినా కూడా సౌత్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్ అయితే టాలీవుడ్ ముందు బాలీవుడ్ ఎందుకూ పనికి రాదని క్లారిటీ ఇచ్చింది.
మన హీరోల నటనకు బాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. మేము వాళ్ల అభిమానులం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ తాను రామ్ చరణ్ కు అతి పెద్ద అభిమానిని అని.. మగధీర చూసినప్పటి నుంచి అతడి వర్క్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు రణవీర్ సింగ్. మరోవైపు కియారా అద్వానీ, జాన్వీకపూర్, అనన్య పాండే లాంటి హీరోయిన్లు విజయ్ దేవరకొండకు తాము పెద్ద ఫ్యాన్స్ అని అనౌన్స్ చేశారు. మొన్న పుష్ప సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ అంతా అల్లు అర్జున్ జపం చేస్తున్నారు. అందులో బన్నీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. దానికి తోడు నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పుష్ప రీల్స్ చేసి సినిమా రేంజ్ ఇంకా పెంచేశారు. అప్పటి నుంచి ఎవరిని అడిగినా తాను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెబుతున్నారు.
పుష్పలో బన్నీ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. అర్జున్ కపూర్, కరణ్ జోహార్, జాన్వీ కపూర్ సహా ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు పుష్ప సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా మరో హీరో కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యాడు. బాలీవుడ్‌తో పాటు భోజ్‌పురిలో కూడా ఎన్నో సినిమాలు చేసిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి పుష్ప సినిమా చూసి ఫిదా అయిపోయాడు. ఏమి చేశ్వ్ అయ్యా క్యారెక్టర్ కు ప్రాణం పోసావు.. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా నేను చూడలేదు అంటూ పుష్ప సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు మిథున్. ఇక బన్నీ నటన గురించి మాట్లాడుతూ.. ఒక క్యారెక్టర్లో ఇంతగా లీనమైన నటుడిని ఈ మధ్య నేను చూడలేదు.. అదరగొట్టావు అంటూ ప్రశంసించాడు. మొత్తానికి పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు అల్లు అర్జున్. ఇక పార్ట్ 2 విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందో..!
Read More :
Pushpa Movie | పుష్ప సినిమా ఛాన్స్‌ను అంతమంది మిస్ చేసుకున్నారా?”
డచ్ వరకు వరకు పాకిన పుష్ప మానియా..శ్రీవల్లీ పాటను ఆలపించిన డచ్ సింగర్..”
“Allu Arjun | ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

