డచ్ వరకు వరకు పాకిన పుష్ప మానియా..శ్రీవల్లీ పాటను ఆలపించిన డచ్ సింగర్..
Pushpa movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప.
Pushpa movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బన్నీ తన నటనతో అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలైతే రీల్స్ లో యూట్యూబ్ షార్ట్స్‌లో సోషల్ మీడియాను ఊపేసింది. పలువురు క్రికెట్ సెలబ్రెటీలు కూడా పుష్పలోని పాటలకు స్టెప్స్ వేశారు. పుష్ప పాటలు ఖండాంతరాలు దాటాయి. ఇప్పటికే టాంజానియాలోని కిలి పాల్ పుష్పలోని సామి సామి, ఊ అంటావా, శ్రీవల్లీ పాటలకు స్టెప్ప్ వేసాడు. తాజాగా ఇప్పుడు ఈ పాటలు డచ్ వరకు వెళ్ళాయి. పుష్ఫ చిత్రంలోని శ్రీవల్లీ పాటను ప్రముఖ డచ్ సింగర్ ఎమ్మా హిస్టర్ ఇంగ్లీష్ పదాలను జోడించి పాటను ఆలపించింది.
హే సిద్ శ్రీరామ్, శ్రీవల్లీ పాటను రికార్డింగ్ చేసినప్పుడే నీకు చెప్పా , సరదాగ ఇంగ్లీష్ వెర్షన్ చేద్దామని.. ఇప్పుడు ఎమ్మా హిస్టర్ హమ్మింగ్ చేసిన కవర్ సాంగ్ చాలా బాగుంది. మనం కూడ మన వెర్షన్లో చేద్దాం అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. ఇప్పటికే పుష్ప ఆల్బమ్ అన్ని వెర్షన్లలో కలిపి 1 బిలియన్ వ్యూస్‌ను సాధించాయి. బన్నీకి అలవైకుంఠపురం, పుష్ప బ్యాక్ టు బ్యాక్ 1 బిలియన్ వ్యూస్‌ను సాధించాయి.
లేటెస్ట్గా 50రోజులు పూర్తి చేసుకున్న పుష్ప చిత్రం 365కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సెకండ్‌వేవ్ తర్వాత అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో 100కోట్ల నెట్ షేర్‌ను కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. బన్నీకి జోడిగా రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటించింది.
Loved this🎶❤️🎶
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

