Pushpa Movie | పుష్ప సినిమా ఛాన్స్‌ను అంతమంది మిస్ చేసుకున్నారా?
Pushpa movie | పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యూజిక్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచంలో మిగిలిన అన్ని చోట్ల బంపర్ హిట్ అయింది పుష్ప. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టికెట్ రేట్లు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణలో 36 కోట్ల లక్ష్యాన్ని ఛేదించి దాదాపు 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇక హిందీలో అయితే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అన్నిటిలో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. అటు సుకుమార్.. ఇటు అల్లు అర్జున్ ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే పుష్ప సినిమాను కొంతమంది స్టార్స్ ముందు రిజెక్ట్ చేశారు. వాళ్లు కాదు అనుకున్న తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వచ్చింది ఈ ప్రాజెక్టు. హీరో నుంచి మొదలు పెడితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు సుకుమార్ ముందు ఒకటి అనుకుంటే తర్వాత ఇంకొకరు వచ్చారు.
పుష్ప సినిమా కథ మహేశ్ బాబు కోసం సిద్ధం చేశాడు సుకుమార్. అప్పట్లో ఈ కాంబినేషన్లో సినిమా కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇలాంటి క్యారెక్టర్లో తనను తాను ఊహించలేకపోయాడు మహేశ్. అలా ఆయన తప్పుకోవడంతో అల్లు అర్జున్ వచ్చాడు. మరోవైపు రష్మిక మందన కంటే ముందు హీరోయిన్గా సమంతను అనుకున్నాడు లెక్కల మాస్టారు. రంగస్థలంలో రామలక్ష్మి క్యారెక్టర్లో ఈమె నటించిన తీరుకు ఫిదా అయిపోయిన సుక్కు పుష్పలో ఆఫర్ ఇచ్చాడు.. కానీ అనివార్య కారణాలతో సమంత ఇందులో చేయలేకపోయింది. కానీ కెరీర్లో తొలిసారి ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఇదే ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పేరు ముందుగా అనుకున్నాడు సుకుమార్. బాలీవుడ్ కమిట్మెంట్స్ వల్ల ఆమె పుష్ప ఆఫర్ వదిలేసుకుంది.
పార్టీ లేదా పుష్ప అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో అదరగొట్టిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా ముందు పుష్పలో లేడు. విజయ్ సేతుపతి కాదన్న తర్వాత ఈ సినిమాలోకి ఆయన వచ్చాడు. అలాగే సినిమా అంతా అల్లు అర్జున్‌తో ఉండే పాత్రలో కొత్త నటుడు జగదీశ్ బండారి నటించాడు. ఈయన కంటే ముందు బిగ్‌బాస్ ఫేమ్ మహేశ్ విట్టాను అనుకున్నాడు సుకుమార్. ఆడిషన్ కూడా చేసిన తర్వాత ఈయనను సినిమా నుంచి తప్పించారు. ఇక నారా రోహిత్ కూడా పుష్ప సినిమా మిస్ చేసుకున్న వాళ్లలో ఉన్నాడు. ఇలా ఇంతమంది ఆర్టిస్టులు పుష్ప సినిమాను వదులుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

