DJ Tillu Movie Collections | సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ డీజే టిల్లు. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టిల్లు ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. తొలి రెండు రోజుల్లో ఏకంగా 7.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఏపీ తెలంగాణలో దాదాపు 1.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి 70 లక్షల వరకు వసూలు చేసింది ఈ సినిమా. మొత్తంగా మూడు రోజుల్లో 9.4 కోట్ల షేర్ వసూలు చేసింది డీజే టిల్లు.
డీజే టిల్లు సినిమా బిజినెస్ 8 కోట్ల 50 లక్షలు జరిగితే.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడమే కాకుండా లాభాలు కూడా తీసుకొచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. 1-2 ఏరియాల్లో మినహాయిస్తే ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది డీజే టిల్లు. ఓవర్సీస్లో అయితే లాభాల సునామీ కనిపిస్తోంది. నైజాంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తుంది ఈ సినిమా. ఈ వీకెండ్ కూడా పెద్దగా సినిమాలు లేవు. దాంతో ఖచ్చితంగా రెండో వారం కూడా డీజే సౌండ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా ఫుల్ రన్ లో 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తోంది డీజే టిల్లు. ఇదే జరిగితే ఇటు నిర్మాతలకు.. అటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండినట్టే.