Priyanka Chopra | చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే పండుగల్లో దీపావళి (Diwali) ముందు వరుసలో ఉంటుంది. పండుగకు పది రోజుల ముందే ప్రజలు వేడుకలను మొదలు పెట్టేస్తారు. ఇక సినీ తారలైతే పార్టీలు, వేడుకలంటూ సందడి చేస్తుంటారు. రోజుకో చోట పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ గ్లోబల్ స్టార్ తాజాగా లండన్ (London)లో జరిగిన దివాళి బాల్ (Diwali Ball)కు హాజరై సందడి చేశారు. ఎరుపు రంగు గౌను ధరించి హాట్ లుక్‌లో (red-hot look) అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఏడాదిలో తనకు ఎందో ఇష్టమైన రోజు, ప్రపంచంలోనే తనకు ఇష్టమైన నగరాల్లో ఒకటి.. అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా, గతేడాది కూడా ప్రియాంక చోప్రా లండన్‌లో దివాళీ పార్టీలో మెరిసిన పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సబ్యసాచి డిజైన్ చేసిన రెడ్ శారీలో పీసీ ఎంతో అందంగా కనిపించారు.

Priyanka Chopra1

Priyanka Chopra2

Priyanka Chopra3

Priyanka Chopra4

Priyanka Chopra5

Priyanka Chopra6

Priyanka Chopra7

Priyanka Chopra8
Also Read..
Raghava Lawrence | ఎట్టకేలకు రాఘవ లారెన్స్‌ని కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్