Bihar Elections | బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లుగా ఒక వీడియో వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోను ఆర్జేడీ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో మరింత చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచార వీడియోపై మనోజ్ బాజ్పేయ్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని మార్ఫింగ్ చేసి సృష్టించబడిందని ఆయన స్పష్టం చేశారు.
”ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. అది ఎవరో సృష్టించిన ఫేక్ వీడియో. దయచేసి అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయట్లేదు అని మనోజ్ బాజ్పేయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
I would like to publicly state that I have no association or allegiance with any political party. The video being circulated is a fake, patched-up edit of an ad I did for @PrimeVideoIN. I sincerely appeal to everyone sharing it to stop spreading such distorted content and urge… https://t.co/teeCJLhgvI
— manoj bajpayee (@BajpayeeManoj) October 16, 2025