Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రసిద్ధ ఆలయాలను (temples) సందర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మరో ఆలయాన్ని పీసీ సందర్శించారు.
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయాన్ని ప్రియాంక శుక్రవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం కారులో బయల్దేరి దోమకొండ చేరుకున్నారు. అక్కడ గడికోటలో కొలువుదీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి వెళ్లారు. ఆలయంలోని సోమసూత్ర శివలింగానికి (Lord Shiva temple) పీసీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని పీసీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. పొగమంచుకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అందుకే హైదరాబాద్‌కు పీసీ
పాపులర్ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు పరిమితమైపోయిందని తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎస్ఎస్ఎంబీ 29తో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా టొరంటో నుంచి హైదరాబాద్‌లో ల్యాండైంది. దీనిక్కారణం మహేశ్ బాబు చేయబోతున్న కొత్త సినిమానేనట.
ప్రియాంకా చోప్రా.. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) అనౌన్స్మెంట్ ఈవెంట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిందని నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే ఐదేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా చేయబోతున్న భారతీయ సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కానుంది. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక రాజమౌళితో సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు.
Also Read..
MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది
Dil Raju | దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ సోదాలు..