Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ఫ్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైలెస్సో హైలెస్సా పాటను రిలీజ్ చేశారని తెలిసిందే. సాంగ్ లాంచ్ ఈవెంట్లో కాలేజ్ విద్యార్థినితో కలిసి డ్యాన్స్ చేశారు నిర్మాత అల్లు అరవింద్. సంప్రదాయ లంగావోణిలో ఉన్న ఓ అమ్మాయి స్టేజ్‌పైకి వచ్చి హైలెస్సో హైలెస్సా పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. అల్లు అరవింద్ ఆమెతో కలిసి హుక్ స్టెప్ వేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
శ్రీమణి రాసిన ఈ పాటను దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్‌లో శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ఎంతెంత దూరాన్ని నువ్వూ నేనూ మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు..ఎన్నెన్ని తీరాలు నీకూ నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం..నీవు లేకుండా ఎంత అన్యాయం గడియారంలో సెకనుల ముల్లే గంటకు కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం..నువు లేకుంటే కదలదు కాలం అని నెలలో ఉండే తేదీ కూడా డాదయ్యిందే..హైలెస్సో..’ అంటూ హీరోహీరోయిన్ల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
The ever energetic #AlluAravind Garu dances to #HilessoHilessa with students at the launch event 💥💥❤🔥#Thandel third single out now!
▶️ https://t.co/8FALGFgAPO pic.twitter.com/bJ2ToptT6U— BA Raju’s Team (@baraju_SuperHit) January 23, 2025
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?