Rashmika Mandanna | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఛావా (Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహిస్తుండగా.. మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక తనకు ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అంతేకాదు తన పాత్ర ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ.. ఫన్నీగా కామెంట్ చేసింది. ఈ అవకాశం ఒక గౌరవంగా భావిస్తున్నా. దక్షిణాది నుండి వచ్చిన ఓ అమ్మాయికి మహారాణిగా యేసుబాయి పాత్ర పోషించే అవకాశం రావడం నా జీవితంలో నేను కోరుకునే అత్యంత గౌరవప్రదమైన.. గొప్ప ప్రత్యేకత కలిగిన విషయం. Chhaava తర్వాత నేను రిటైర్ కావడం సంతోషంగా ఉందని లక్ష్మణ్ సర్‌కు చెబుతున్నానంది రష్మిక మందన్నా అన్నారు.
‘నేను ఏడ్చే వ్యక్తిని కాదు, కానీ ఈ ట్రైలర్ నన్ను ఏడిపించేసింది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు.. అతను ఛావా.’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. ఇంతకీ రష్మిక మందన్నా కేవలం తన పాత్రనుద్దేశించి మాత్రమే ఇలా మాట్లాడిందా..? లేదంటే నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటుందా..? అంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఛావా ఫిబ్రవరి 14న విడుదలవుతోంది.
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?