Priyanka Chopra | గ్లామరస్ రోల్స్ అయినా.. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకైనా ప్రాణం పోసే నటీమణులకు ఇండస్ట్రీలో కొదవేమీ లేదు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). అందం, అభినయంతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడిందని తెలిసిందే.
అమెరికాలో సెటిలైన తర్వాత ఎప్పుడో కానీ ఇండియాలో కనిపించడం లేదు. చాలా కాలం తర్వాత ప్రియాంకా చోప్రా ముంబైకి వచ్చింది. అది కూడా పొద్దున పొద్దునే ముంబైలో ల్యాండవడం విశేషం. ఇంతకీ ప్రియాంకా చోప్రా ఇలా సడెన్‌గా ముంబైలో ప్రత్యక్షమవడానికి కారణమేంటనుకుంటున్నారా..? ముంబైలో Jio MAMI Film Festival 2023 ఓపెనింగ్ నైట్ ఈవెంట్లో పాల్గొనేందుకు ముంబైకి వచ్చింది. బ్లాక్ క్రాప్ టాప్ మ్యాచింగ్ ప్యాంట్స్‌తో ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించగా.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో ఈ ఫెస్టివల్ జరుగనుంది.
ప్రియాంకా చోప్రా చివరగా 2016లో వచ్చిన జై గంగాజల్ హిందీ చిత్రంలో లీడ్ రోల్లో మెరిసింది. ఆ తర్వాత హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 (NTR 31)గా రాబోతున్న సినిమాతో ప్రియాంకా చోప్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Welcome home PC #PriyankaChopra is in Mumbai for the mega opening night of MAMI#PriyankaChopra#MumbaiAirport pic.twitter.com/cD1tK3x5g2
— Rakshitanagar 🇮🇳 (@rakshitanagar28) October 27, 2023
Priyanka Chopra1
Priyanka Chopra2
Priyanka Chopra3
ముంబైలోని నివాసంలో ఇలా..
Desi #PriyankaChopra landed in Mumbai pic.twitter.com/x6T44oAbkX
— lakhpati (@dutta_lakhpati) October 27, 2023
View this post on Instagram