Purushaha | టైటిల్‌తో ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పకుంటోంది పురుష (Purushaha) టీం. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది.. అంటూ అందరి ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. వీరు వులవల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
మేకర్స్ ఇప్పుడు పురుష ప్రాజెక్ట్ నుంచి మరో పోస్టర్‌ను షేర్ చేశారు. ఆమె రూల్.. ఆమె పవర్.. క్షమాపణలు లేవు.. మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం.. రివర్స్ మోడ్ ఆన్ అయింది.. మహిళలు అన్‌స్టాపబుల్ అంటూ రిలీజ్ చేసిన తాజా లుక్‌లో లేడీ పాదం ముగ్గురు మగాళ్లు భయానక పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తాజా లుక్ పురుష సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది.
బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత..
పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అంటున్నారు. బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధ భూమిగా మారుతుంది.. అంటూ ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లలో పవన్ కల్యాణ్ యుద్ద వీరుడి గెటప్‌లో కనిపిస్తుంటే.. కసిరెడ్డి కసిరెడ్డి రాజ్‌కుమార్ స్పైడర్ మ్యాన్‌గా, సప్తగిరి దేవదూతను తలపించే గెటప్‌లో కనిపిస్తున్నారు. ఒకరి డ్రెస్‌పై ఎగిరి పక్షి బొమ్మ కనిపిస్తుంటే.. మరొకరి చాతిపై లవ్ సింబర్.. ఇంకొకరిపై కత్తెర సింబల్ కనిపిస్తున్నాయి. మొత్తానికి బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత కదనరంగంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
ఈ మూవీని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. కామెడీ జోనర్లో వస్తోన్న వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Her Rule. Her Power. No Apologies. 🔥
మగాళ్లను మొక్కుకుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం
Reverse mode on. Women are unstoppable.
Women Domination On #Purushaha@kalyanb949 @urvaishukrish@VeeruVulavala #SatishMutyala@urvaishukrish @Actor_Rajkumar9
@vennelakishore@vtvganeshoff… pic.twitter.com/qINfh46xEL— Sapthagiri (@MeSapthagiri) December 8, 2025
Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Actor Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం
V. Shantaram Biopic | వి. శాంతారామ్ బయోపిక్‌లో హీరోయిన్గా తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్