V. Shantaram Biopic | భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు, సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన దిగ్గజ చలనచిత్రకారుడు వి. శాంతారామ్ (V. Shantaram) జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన అద్భుతమైన సినీ ప్రయాణం ఆధారంగా బాలీవుడ్లో ఒక భారీ బయోపిక్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ఆయన పేరునే ‘వి. శాంతారామ్’గా ఖరారు చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టైటిల్ పాత్ర (వి. శాంతారామ్ పాత్ర)లో ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) నటించబోతుండగా.. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి సిద్దాంత్ చతుర్వేది ఫస్ట్ లుక్‌ని విడుదల చిత్రబృందం తాజాగా కథానాయికను పరిచయం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా తమన్నా భాటియా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ బయోపిక్‌ను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే మరియు సరిత అశ్విన్ వర్దే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం వి. శాంతారామ్ యొక్క అద్భుతమైన సినీ ప్రయాణాన్ని చూపించనుంది. సైలెంట్ యుగం (మూకీ సినిమాల కాలం) నుంచి టాకీలు (శబ్దంతో కూడిన సినిమాలు) ఆపై కలర్ సినిమా యుగం వరకు ఆయన చేసిన కృషి, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఘనమైన ప్రస్థానాన్ని ఈ చిత్రం తెరకెక్కించనుంది.
శాంతారామ్ సినీ ప్రస్థానం
1901 నవంబర్ 18, 1901లో మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో జన్మించిన వి. శాంతారామ్ 1921లో నటుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు. అనంతరం నటనతో పాటు మొత్తం 55కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ (1929), రాజ్‌కమల్ కళామందిర్ (1942) లాంటి సంస్థలు స్థాపించి 92 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించాడు. శాంతారామ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అతడిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1985), పద్మవిభూషణ్ (1992 మరణానంతరం) లతో సత్కరించింది.
The star of an era ✨
The strength behind a legacy 🎞️
A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025